'సుబ్రహ్మణ్యపురం' సస్పెన్స్ థ్రిల్లర్ ట్రైలర్

SMTV Desk 2018-11-22 12:51:48  Subrahmanyapuram, movie trailer, sumanth, esha rebba

హైదరాబాద్, నవంబర్ 22: సంతోష్ జాగర్లపూడి డైరెక్షన్ లో హీరో సుమంత్ నటిస్తున్న చిత్రం సుబ్రహ్మణ్యపురం . ఈషా రెబ్బా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇదివరకే ఈ సినిమా టీజర్ రిలీజ్ కాగా.. తాజాగా సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసింది మూవీ యూనిట్.

ఈ ప్రాజెక్టులో నన్ను ఎక్కువ ఆకర్షించింది సుబ్రహ్మణ్యపురం.. అంటూ సుమంత్ డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ఈ దేవాలయంలో ఏవైనా అద్భుతాలు జరిగాయా కార్తిక్ అంటూ సాయికుమార్.. సుమంత్ ను అడగడం.. ఇలా.. సుబ్రహ్మణ్యపురం ట్రైలర్ లోని ప్రతి సీన్, ప్రతి డైలాగ్ సస్పెన్స్, థ్రిల్ కలిగించే విధంగా ఉంటాయి. ట్రైలర్ మొత్తం చూస్తుంటే.. సస్పెన్స్ థ్రిల్లర్ లా సినిమా ఉంటుందని సినీ అభిమానులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి ఓ దేవాలయంపై ఈ సినిమాలో హీరో రీసెర్చ్ చేస్తుంటాడని తెలుస్తోంది. ఈసందర్భంగా కొన్ని అసాధారణ సంఘటనలు చోటు చేసుకుంటాయి. అయితే.. అవి దేవుడు చేయించాడా? లేక మనిషా.. అనే విషయం తెలుసుకోవడం కోసం అన్వేషిస్తుంటాడు హీరో.. ఈ బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉంటుందని తెలుస్తోంది.