'ఆర్ ఆర్ ఆర్' ప్రతినాయకుడిగా బాలీవుడ్ స్టార్..?

SMTV Desk 2018-11-21 18:55:51  RRR, Ram charan, rajamouli, ntr, ajay devgan

హైదరాబాద్, నవంబర్ 21: సంచలన దర్శకుడు రాజమౌళి, ఎన్.టి.ఆర్, చరణ్ కలిసి చేస్తున్న భారీ మల్టీస్టారర్ ఆర్.ఆర్.ఆర్. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా ఈమధ్యనే ముహుర్త కార్యక్రమాలను పూర్తి చేసుకోగా ఈ నెల 19 నుండి రెగ్యులర్ షూట్ కు వెళ్ళిన విషయం తెలిసిందే.

అయితే షూటింగ్ ప్రారంభమై ఇంకా నాలుగైదు రోజులు గడవకుండానే ఆర్ఆర్ఆర్ అప్పుడే కీలక వార్తల్లో నిలుస్తోంది. మొదటి రోజు క్యాజువల్ గా దిగిన ఫోటోతో పాటు కెమెరా యాక్షన్ అని చెప్పిన వీడియో మాత్రమే షేర్ చేసుకున్న రాజమౌళి ఆపై సైలెంట్ అయిపోయాడు. గుట్టుచప్పుడు కాకుండా షూటింగ్ కానిచ్చేస్తున్నారు. రామ్ చరణ్ తారక్ కాంబోలో వచ్చే కొన్ని సన్నివేశాలు ఈ షెడ్యూల్ లో ఉండబోతున్నాయి.

హీరోయిన్లు ఎవరో ఇంకా బయటికి చెప్పడం లేదు. కియారా అద్వానీ, కీర్తి సురేష్, రాశి ఖన్నా పేర్లు క్రమం తప్పకుండ వినిపిస్తున్నాయి. ఇకపోతే ఇందులో విలన్ గా ఈ ఇద్దరు హీరోలకు ధీటుగా అనిపించే నటుడు ఎవరు ఉంటారా అనే సందేహం అభిమానుల్లో విపరీతంగా ఉంది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం వొక బాలీవుడ్ స్టార్ హీరోని జక్కన్న సెట్ చేసే ప్రయత్నంలో ఉన్నాడట.

అతను మరెవరో కాదు. అజయ్ దేవగన్. మాస్ యాక్షన్ హీరోగా నార్త్ తో పాటు ఇక్కడ కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న అజయ్ ను వొప్పించే ప్రయత్నం దాదాపు వొక కొలిక్కి వచ్చిందని సమాచారం. ఇప్పటికే 2.0 ద్వారా అక్షయ్ కుమార్ నమ్మశక్యం కాని విలన్ పాత్రతో సౌత్ లో అడుగు పెడుతున్నాడు.