ఆసిస్ తో పోరాడి ఓడిన భారత్

SMTV Desk 2018-11-21 18:38:48  t20 series, australiya, team india

బ్రిస్బేన్, నవంబర్ 21: బ్రిస్బేన్, నవంబర్ 21: బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే తొలి టీ20 మ్యాచ్‌లో కోహ్లి సేన టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ తొలుత మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం భారత్ విజయం లక్ష్యం 17 ఓవర్లకు 174 పరుగులుగా నిర్ణయించారు.

ఈ నేపథ్యంలో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఐదో ఓవర్‌లో ఓపెనర్ రోహిత్ శర్మ(7) చెత్త షాట్‌కు ప్రయత్నించి ఫించ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత లోకేశ్ రాహుల్(13), విరాట్ కోహ్లీ(4) ఊహించినంతగా రాణించలేదు. కానీ శిఖర్ ధవన్ మాత్రం పట్టువదలకుండా బ్యాటింగ్ చేశాడు. ఓవైపు సహచర బ్యాట్స్‌మెన్లు స్వల్పస్కోర్‌లకే పెవిలియన్ చేరుతున్నా.. తను మాత్రం చెలరేగిపోయాడు.

42 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సులతో 76 పరుగులు చేసి భారత్‌కు విజయాన్ని అందించేందుకు కృషి చేశాడు. కానీ దినేశ్ కార్తీక్(30) మినహా మిగితా వారి నుంచి సరైన సహకారం అందకపోవడంతో భారత్ 17 ఓవర్లలో 169 పరుగులు చేయగలిగింది. దీంతో ఆస్ట్రేలియా 4 పరుగులతో విజయం సాధించి సిరీస్‌లో 1-0 తేడాతో ఆధిక్యం సాధించింది. ఆస్ట్రేలియా బౌలింగ్‌లో ఆడం జంపా, మార్కస్ స్టోనిస్ చెరి రెండు, అండ్రూ టై, బిల్లీ స్టాన్‌లేక్, జేనస్ తలో వికెట్ తీశారు.