పేటీఎం ద్వారా ఎల్‌ఐసీ ప్రీమియం

SMTV Desk 2018-11-21 18:36:36  Paytm, LIC premium

డిజిటల్ వాలెట్ సేవల సంస్థ పేటీఎం ద్వారా కూడా ఎల్ఐసీ ప్రీమియం చెల్లించవచ్చు. ఈ మేరకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వొక ప్రకటనను విడుదల చేసింది. పేటీఎం సంస్థతో వొప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. ఇప్పటికే భారతదేశంలో దాదాపు 30 జీవిత బీమా సంస్థలు ప్రీమియం చెల్లింపుల కోసం పేటీఎం సేవలు తీసుకుంటున్నాయి. తాజాగా.. ఆ జాబితాలోకి ఎల్ఐసీ కూడా చేరింది.

ఈ మేరకు రెండు సంస్థల మధ్య వొప్పందం కుదిరిందని పేటీఎం సీవోవో కిరణ్ వాసిరెడ్డి తెలిపారు. ఇప్పటికే పేటీఎం ద్వారా దాదాపు 30 కంపెనీలు ఇన్సూరెన్స్ ప్రీమియంలు చెల్లిస్తున్నాయని, తాజాగా ఎల్‌ఐసీ సంస్థకు కూడా ప్రీమియంలను చెల్లించవచ్చని పేటీఎం సీవోవో అన్నారు.