తొలి టీ20లో టీంఇండియా విజయ లక్ష్యం 174

SMTV Desk 2018-11-21 17:21:54  t20 series, australiya, team india

బ్రిస్బేన్, నవంబర్ 21: బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే తొలి టీ20 మ్యాచ్‌లో కోహ్లి సేన టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నది. అయితే మ్యాచ్‌లో ఆసీస్ నాలుగు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది16. 1 ఓవర్ల వద్ద వర్షం పడటంతో ఆట కొద్దిసేపు నిలిచిపోయింది. అప్పటికి ఆసీస్ జట్టు మూడు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.

మ్యాచ్‌కి వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ (డీఎల్ఎస్) పద్ధతిలో మ్యాచ్‌ను 17ఓవర్లకు కుదించడం జరిగింది. వర్షం తెరిపి ఇచ్చిన అనంతరం ఆసీస్ తన ఆట కొనసాగించింది. ఆ తర్వాత వికెట్ నష్టానికి మరో అయిదు పరుగులు జోడించింది. దీంతో టీమిండియాకు 17 ఓవర్లలో 174 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. అంతకు ముందు టాస్‌ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకోవడంతో ప్రత్యర్థి జట్టు ముందుగా బ్యాటింగ్‌కు దిగింది.

కాగా ఇక డిసెంబర్‌లో జరగనున్న టెస్టు సిరీస్‌లోనూ తమను తాము ఫేవరెట్స్‌గా నిరూపించుకునేందుకు ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆధిపత్యం ప్రదర్శించాలని కోహ్లీ సేన భావిస్తోంది. 2017 నవంబర్ నుంచి ఇప్పటి వరకు టీమిండియా ఏడు సిరీస్‌లలో గెలిచింది. గతేడాది జూలైలో వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో చివరిసారి ఓటమిపాలైంది. అయితే గత ఆస్ట్రేలియా పర్యటనలో టీ20 సిరీస్‌ను మెన్ ఇన్ బ్లూ 3-0తో సిరీస్‌ను గెలిచింది. దాన్ని ఆసరాగా చేసుకుని ఇప్పుడు కూడా కోహ్లీ సేన ఉత్సాహంగా ఉంది...