ఏపీ బోగస్ ఓట్ల జాబితా

SMTV Desk 2018-11-21 13:11:26  Andrapradesh, election commission, bogus votes

అమరావతి, నవంబర్ 21: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 25,47,019 బోగస్ ఓట్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల కమిషన్ మంగళవారం విడుదల చేసింది. ఈ సందర్భంగా జిల్లాల వారీగా బోగస్ ఓట్ల సంఖ్యను ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం వెల్లడించింది. అత్యధికంగా అనంతపురంలో 3,55,819 బోగస్ ఓట్లు ఉండగా.. అత్యల్పంగా కడపలో 91,377 బోగస్ ఓట్లు నమోదు అయ్యాయని తెలిపింది.

జిల్లాల అనుమానాస్పద ఓట్ల జాబితా…

శ్రీకాకుళం– 1,23,233
విజయనగరం– 1,10,036
విశాఖపట్నం– 2,00,767
తూర్పు గోదావరి– 2,04,370
5. పశ్చిమ గోదావరి– 1,24,085
కృష్ణా– 1,12,555
గుంటూరు– 2,07,209
ప్రకాశం – 1,41,812
నెల్లూరు– 2,19,736
కడప– 91,377
కర్నూలు– 3,13,032
అనంతపురం– 3,55,819
చిత్తూరు– 3,42, 961