కేటీఆర్ కు... నారా లోకేశ్..!

SMTV Desk 2017-07-24 16:05:13  telangana it minister ktr, andrapradhesh it minishter nara lokehs ktr birthday

హైదరాబాద్, జూలై 24 : రాష్ట్ర మున్సిపల్ శాఖ, ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తన పుట్టిన రోజు సందర్భంగా ట్వీట్టర్ లో లోకేష్ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలంటూ ఆయన ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. కేటిఆర్ రీ ట్వీట్లో ధన్యవాదాలు తెలుపుతూ, తెలుగు రాష్ట్రాల పరస్పర అభివృద్ధికి కలసి పనిచేద్దాం అని నారా లోకేశ్ కు పిలుపునిచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలసి సాకుదాం అని కేటీఆర్ స్నేహ హస్తం అందించారు. ఈ మేరకు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు సోషల్ మీడియాలో కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.