విరామం లేకుండా సాగుతున్న కేసిఆర్ ప్రచారాలు

SMTV Desk 2018-11-20 18:29:58  Telangana assembly elections, KCR

ఎల్లారెడ్డి, నవంబర్ 20: తెరాస అధినేత, తెలంగాణ అపద్దర్మ్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో శరవేగంగా దూసుకేల్తున్నాడు. ఇందులో భాగంగానే నిన్న ఖమ్మం జిల్లాలో ఆయన పర్యటించారు. నేడు వొక్కరోజే నాలుగు సభల్లో కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఎల్లారెడ్డిలో మంగళవారం సాయంత్రం నిర్వహించనున్న సభలో తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా సభా వేదిక, తదితర ఏర్పాట్లను మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, స్థానిక తెరాస అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డి తదితరులు పర్యవేక్షిస్తున్నారు.

సభను విజయవంతం చేసేందుక భారీగా జనసమీకరణ చేస్తున్నారు. 50 వేల మంది ప్రజలను తరలించేందుకు వాహనాలను సమకూర్చుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లను పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఇందుకుగాను మొత్తం 200 మందికి పైగా పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ముందస్తు ప్రకటన నాటి నుంచి నేటి వరకు కేసీఆర్ వేగాన్ని మహాకూటమి అందుకోలేపోతున్నారు.