అమరులు సమాధుల్లో...అడ్డుకున్నవారు పదవుల్లో!!

SMTV Desk 2017-05-31 11:46:28  revanth reddy,tdp leader,fire on kcr, meet the press

హైదరాబాద్, మే 31 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడుగడుగునా అడ్డుకున్నవారిని పదవులతో అందాలం ఎక్కించారని తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు రేవంత్ రెడ్డి కేసిఆర్ పై విరుచుక పడ్డారు. తెలంగాణా కోసమై ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులు సమాధుల్లోకి వెళితే .. రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్న వారు గద్దెనెక్కి రాజ్యమేలుతున్నారని...ఈ విషయం ద్వారానే కేసిఆర్ కు తెలంగాణా ఉద్యమం,ఉద్యమకారుల పట్ల ఎంత చిత్తశుద్ది ఉందో అర్ధం అవుతుందని ప్రకటించారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ 52 వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గోన్నారు. ప్రభుత్వం ద్వారా 2014 ఆగస్టు 19న నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ద్వారా అమరుల కుటుంబాలను గుర్తించి సహాయాన్ని, గుర్తింపును కల్పించాల్సిన అవసరం ఉండిందని ఆయన అభిప్రాయపడ్డారు. కొత్త రాష్ట్రం ఏర్పాటయినప్పటికి ఆంధ్రానేతలు, గుత్తేదారులు, కళాకారులకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీకి అవకాశం వస్తే అమరుల స్థూపాన్ని అధికారిక చిహ్నంలో పొందుపరుస్తామని ప్రకటించారు. ధర్నాచౌక్ నగరంలోనే ఉండాలని డిమాండ్ చేసే పరిస్థితి కేసీఆర్ కుటుంబానికి వస్తుందని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు.