ఆర్.ఆర్.ఆర్ లో బాలీవుడ్ భామ

SMTV Desk 2018-11-18 15:08:34  RRR, Jahnvi Kapoor, rajamouli

రాజమౌళి చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాపై నేషనల్ మీడియా హంగామా మొదలైంది. ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి నటిస్తున్న ఈ మల్టీస్టారర్ సినిమాలో హీరోయిన్ గా ఎవరికి ఛాన్స్ దక్కనుందో అని అందరు ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు. కీర్తి సురేష్, కియారా అద్వాని, రష్మిక లాంటి హీరోయిన్స్ పేర్లు వినబడుతుండగా లేటెస్ట్ గా ట్రిపుల్ ఆర్ లో జాన్వి కపూర్ నటిస్తుందని జాతీయ మీడియా చెప్పుకొస్తుంది.

బాహుబలి సినిమా హిందిలో బ్లాక్ బస్టర్ హిట్ అవడానికి సహకరించిన కరణ్ జోహార్ ఈ ట్రిపుల్ ఆర్ ను కూడా తానే రిలీజ్ చేసేలా ఢీల్ కుదుర్చుకున్నాడు. ఇక జాన్విని ఈ సినిమాలో నటింపచేసేలా కరణ్ ప్రయత్నాలు చేస్తున్నాడట. బాహుబలిలో శివగామి పాత్రకు శ్రీదేవిని అనుకోగా అది కుదరలేదు. మరి జక్కన్న జాన్విని తీసుకుంటాడా లేదా అన్నది చూడాలి.