ఏపీని పర్యాటక ప్రాంతంగా చేస్తున్నాం : చంద్రబాబు

SMTV Desk 2018-11-17 13:36:03  Andrapradesh, Amaravati, Formula 1 power boating , Chandra babu

అమరావతి, నవంబర్ 17: ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక అభివృద్ధి సంస్థ, యుఐఎం ఎఫ్‌ఎ1హెచ్‌2ఓ వరల్డ్‌ చాంపియన్‌ షిప్‌ ఆధ్వర్యంలో పవర్‌ బోటు రేసింగ్‌ శుక్రవారం మధ్యాహ్నం సీఎం చంద్రబాబు నాయుడు జెండా ఊపీ ప్రారంభించారు. ఈ క్రమంలో అనంతరం మీడియాతో మాట్లాడుతూ అందమైన ఈ అమరావతికి సుందరమైన నది ఉండటమే గొప్ప వరం అంటూ ఆయన పేర్కొన్నారు. ఏపీలో తొలిసారి బోట్ రేసింగ్ నిర్వహించుకోడం సంతోషంగా ఉందన్నారు. గతంలో హైదరాబాద్ కు తీసుకురావాలని ఎంత ప్రయత్నించిన కుదరలేదు. ఇప్పుడు అంతకంటే మంచి పోటీలు నిర్వహించే అవకాశం కలిగిందన్నారు.

రాష్ట్రంలో 70 నుండి 80 కిమీ నదీ తీరం ఉండడం మన అదృష్టమన్నారు. ఏపీని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. కృష్ణా నదిలో అందమైన ద్వీపాలున్నాయి.. దీంతో ప్రపంచ మేటి రాజధాని నిర్మిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కుటుంబ సమేతంగా ఈ బోట్ రేసింగ్ ప్రారంభోత్సవానికి వచ్చిన సీఎం,లోకేశ్ వర్షంలో తడుచుకుంటూ సందడి చేశారు.