మిథాలీకి బంపర్ ఆఫర్

SMTV Desk 2017-07-24 12:11:36  mithaali raaj, sachin tendulkar, cricket, athlet, india, chaamundeshwari nath.

హైదరాబాద్, జూలై 24 : ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్‌లో టీమిండియాను రన్నరప్‌గా నిలిపిన కెప్టెన్‌ మిథాలీ రాజ్‌కు బీఎండబ్ల్యూ కారును బహుమతిగా అందించనున్నట్లు మాజీ క్రికెటర్, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ మాజీ చైర్మన్ చాముండేశ్వరీ నాథ్ ప్రకటించారు. గతేడాది రియో ఒలింపిక్స్‌లో సత్తా చాటిన పీవీ సింధు, దీపా కర్మాకర్, సాక్షి మాలిక్‌లకు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా చాముండేశ్వరీ నాథ్ బీఎండబ్ల్యూ కార్లను బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. 2007లో మిథాలీకి షెవర్లె కారును ఇచ్చిన చాముండి, ఈసారి రూ.40 లక్షల విలువైన బీఎండబ్ల్యూ కారును బహుమతిగా ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కారును సచిన్ చేతుల మీదుగా అందించే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. కాగా క్రీడలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే తాను ఈ బహుమతులను అందిస్తున్నట్టు వివరించారు.