తమిళ్ రీమేక్ లో 'టెంపర్' ఐటమ్ సాంగ్

SMTV Desk 2018-11-17 10:41:41  Sunny leone , NTR, Puri jaganath , Rasi khana , Director venkat

హైదరాబాద్, నవంబర్ 16: తన నటన తో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుని ఎన్టీఆర్ సినిమాలో టెంపర్ వొకటి . ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ డైరెక్టన్ చేసారు. ఈ సినిమాలో ఇట్టాగే రెచ్చిపోదాం అనే ఐటమ్ సాంగ్ అప్పట్లో చాల ఫేమస్ అయిపోయిది . ఐటమ్ సాంగ్స్ లో ఈ పాట ముందు వరుసలో వుంది. అందువలన ఇప్పుడు ఇదే సాంగ్ ని తమిళ రీమేక్ లో చేసేందుకు సిద్ధం చేస్తున్నారు.

ఇందులో హీరో గా విశాల్ నటిస్తున్నాడు . అయోగ్య పేరుగా ఈ సినిమా తమిళ్ లో నిర్మితమవుతోంది . తన నటన తో అభిమానులను ఆకట్టుకున్న సన్నీలియోన్ ని ఐటమ్ సాంగ్ కి ఎంపిక చేసారు. ఇందుకోసం ఆమెకి భారీ పారితోషికమే ఇస్తునట్టు తెలిపారు. తెలుగు లో లాగా తమిళ్ లో కూడా ఈ సాంగ్ మంచి హైలైట్ కావాలి అని విశాల్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడట. వెంకట్ డైరెక్షన్ చేస్తున్న ఈ సినిమా లో రాశి ఖన్నా కథానాయికగా నటిస్తోంది .