బోయపాటి తో మెగా స్టార్ సినిమా

SMTV Desk 2018-11-16 18:07:32  Chiranjeevi, Ram charan, Boyapati seenu

హైదరాబాద్, నవంబర్ 16: ప్రస్తుతం చిరంజీవి సైరా సినిమా షూటింగులో బిజీగా వున్నారు. ఈ సినిమా తరువాత ఆయన కొరటాల దర్శకత్వంలో వొక మూవీ చేయనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరిగిపోతూనే వున్నాయి. కొరటాల తరువాత సినిమాను బోయపాటి శ్రీనుతో చేసే అవకాశం వుందన్నట్టుగా ఫిల్మ్ నగర్లో వొక వార్త హల్ చల్ చేస్తోంది.

చిరంజీవి కోసం వొక విభిన్నమైన కథను రెడీ చేయమని బోయపాటితో చరణ్ చెప్పాడట. వినయ విధేయ రామ విడుదల తరువాత బోయపాటి అందుకు సంబంధించిన పనులపై దృష్టి పెట్టనున్నట్టు చెప్పుకుంటున్నారు. సరైనోడు సినిమా సమయంలోనే బోయపాటి దర్శక ప్రత్రిభను చిరంజీవి ప్రశంసించిన సంగతి తెలిసిందే. ఇక ఈ కాంబినేషన్లో సినిమా చరణ్ బ్యానర్ పై రూపొందుతుందో .. గీతా ఆర్ట్స్ పై నిర్మితమవుతుందో చూడాలి.