'96' రీమేక్ తో అల్లు అర్జున్

SMTV Desk 2018-11-16 17:48:07  Allu arjun, Dil raju, VIjay sethupathi, Thrisha, 96

హైదరాబాద్, నవంబర్ 16: కోలీవుడ్ లో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన చిత్రం 96 . ఈ చిత్రం అక్టోబర్ 4న రిలీజై సూపర్ సక్సెస్ అందుకుంది. ఆ సినిమా రిలీజ్ అవ్వకముందే దిల్ రాజు రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నాడు. అయితే రిలీజ్ తర్వాత సక్సెస్ అయినా తెలుగు రీమేక్ పై ఆలోచనలో పడ్డాడు. విజయ్ సేతుపతిలా నటించే సాహసం ఎవరు చేస్తారన్న అయోమయంలో పడ్డాడు దిల్ రాజు.

ముందు నాని, సమంతలతో ఆ రీమేక్ చేయాలని చూడగా సినిమా చూసిన అల్లు అర్జున్ విజయ్ పాత్రలో తాను చేస్తానని చెప్పాడట. ప్రస్తుతం త్రివిక్రంతో సినిమా లైన్ లో పెట్టిన అల్లు అర్జున్ ఆ సినిమాతో పాటుగా 96 ను రీమేక్ చేయాలని ఫిక్స్ అయ్యాడట. మరి బన్ని చేస్తున్న ఈ సాహసం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. నా పేరు సూర్య సినిమా తర్వాత సినిమా కథల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్న బన్ని 96 చేయడం మాత్రం సర్ ప్రైజ్ అని చెప్పొచ్చు.