పాఠశాలలోనే ప్రసవించిన పదవ తరగతి విద్యార్థిని

SMTV Desk 2017-07-23 17:58:25  The, tenth, class, girl, who, gave, birth, to, the, baby

న్యూఢిల్లీ, జులై 23 : దేశ రాజధాని న్యూఢిల్లీలో ఘోరం జరిగింది. పదవ తరగతి చదువుతున్న 15 ఏళ్ళ బాలిక పై 51 ఏళ్ళ వ్యక్తి పలు మార్లు అత్యాచారం చేయడంతో గర్భవతి అయిన సంఘటన న్యూఢిల్లీ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... న్యూఢిల్లీలోని ముఖర్జీ నగర్ లో ఉంటున్న ఓ బాలికకు డబ్బు ఆశ చూపించి ఓ ప్రబుద్దుడు లొంగదీసుకున్నాడు. బాలిక గర్బం దాల్చడంతో అబార్శన్ చేయించే ప్రయత్నం చేసాడు. కాని అది ఫలించలేదు. పాఠశాలకు పరీక్ష రాయడానికి వెళ్ళిన బాలికకు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో బాత్ రూమ్ కు వెళ్ళి అక్కడే ప్రసవించింది. ఈ విషయాన్ని తెలుసుకున్న పాఠశాల అధికారులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తమ కుమార్తె గర్బవతన్న విషయం బాధితురాలి తల్లిదండ్రులకు తెలియపోవడం గమనార్హం. బాలిక ఫిర్యాదుపై నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు నిర్బయ సహా పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.