ఏపీ నిరుద్యోగులకు శుభవార్త

SMTV Desk 2018-11-16 13:46:15  Andrapradhesh, Unemployments, Governaments, Police jobs

అమరావతి, నవంబర్ 16: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ ఉద్యోగంలో చేరాలనుకునే నిరుద్యోగులకు మరో శుభవార్త తెలిపింది. నిమయామకాని సిద్ధంగా ఉన్న 3137 పోస్టుల కోసం ఎంపిక చేసే నిబంధనలో స్వల్ప మార్పులు తీసుకొచ్చింది. పోలీస్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన వయోపరిమితిని రెండేళ్లు పెంచారు. దీనికి సంబంధించిన అధికారిక ఉతర్వులు త్వరలోనే వెలుబడనున్నాయి. పోలీస్ కానిస్టేబుల్, ఎస్‌ఐ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రస్తుతం ఉన్న వయోపరిమితిని రెండేళ్లు పెంచారు. దీనితో కానిస్టేబుల్ ఉద్యోగం కోసం 18-24 సంవత్సరాల మధ్య ఉన్నవారు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. అలాగే ఎస్‌ఐ ఉద్యోగానికి 21-27 సంవత్సరాల వయనున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వెసులుబాటు ద్వారా జనరల్ కేటగిరీ అభ్యర్థులకు లాభం చేకూరనుంది. బీసీ, ఎస్‌సి, ఎస్‌టి అభ్యర్థులకు కూడా రెండేళ్లు పెరగనుంది.