'అమర్ అక్బర్ అంథోని' రివ్యూ

SMTV Desk 2018-11-16 11:17:45  Amar akbar anthony, Raviteja, Sreenu vaitla, Iliyana

హైదరాబాద్, నవంబర్ 16: శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ, ఇలియానా జంటగా నటించిన చిత్రం అమర్ అక్బర్ అంథోని . ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వొచ్చింది.

నటీనటులు: రవితేజ, ఇలియానా, షాయాజీ షిండే, శ్రీనివాస్ రెడ్డి తదితరులు
దర్శకత్వం: శ్రీను వైట్ల
నిర్మాత:మైత్రి మూవీ మేకర్స్

కథ
న్యూయార్క్ లో ఇద్దరు స్నేహితులు అమర్ (రవితేజ), ఐషు లను పరిచయం చేస్తూ ఈ సినిమా మొదలవుతుంది. వాళ్ళ తండ్రులు కూడా మంచి స్నేహితులు. ఆ రెండు ఫ్యామిలీల మీద కొందరు దాడి చేస్తారు. అమర్ తల్లితండ్రులు చనిపోతారు. తల్లితండ్రులను చంపిన వారిపై పాగా సాదించాలి అనుకుంటాడు అమర్. ఈక్రమంలో ఈవెంట్ మేనేజర్ అయిన ఇలియానాతో పరిచయం ఏర్పడుతుంది. ఇంతలో అక్బర్, ఆంటోనీ గా రవితేజ మరోసారి తెరపై పరిచయం అవుతాడు. వారి ముగ్గురిమద్య ఉన్న వొక లింక్ కి కనెక్ట్ చేసే సీన్ తో ఇంటర్వెల్ బాంగ్. చివరికి అమర్ తన తల్లితండ్రులను చంపిన వారిని ఎలా అంతం చేసాడో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

దర్శకుడిగా శ్రీను వైట్లకు లైఫ్ అండ్ డెత్ లాంటి మూవీ.. హీరోగా రవితేజ నిలదొక్కుకోవాలంటే హిట్ తప్పనిసరి.. ఆరేళ్ల సుదీర్ఘ విరామం తరువాత హీరోయిన్‌గా రీ ఎంట్రీ ఇస్తున్న ఇలియానాకు స్టార్ డమ్ దక్కాలంటే ఈ సినిమాతో రాణించక తప్పదు. అలాంటి తరుణంలో వచ్చిన అమర్ అక్బర్ ఆంటోనీ హిట్ టాక్ సంపాదించుకుంది. ఈ చిత్రంలో మాస్ మహరాజా రవితేజ.. అమర్, అక్బర్, ఆంటోనీ అనే మూడు విభిన్న పాత్రల్లో కనిపించారు. కామెడీ, యాక్షన్, ఎమోషన్స్ మేళవింపుతో వొక్కోపాత్ర వొక్కోలా డిజైన్ చేశారు శ్రీను వైట్ల.

ఈ సినిమా ద్వారా తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్న ఇలియానా తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకున్నారు. గతంలో ఖతర్నాక్, కిక్, దేవుడు చేసిన మనుషులు చిత్రాల్లో రవితేజతో జోడీ కట్టిన ఈ బ్యూటీ రీ ఎంట్రీలో రవితేజతో జోడీ కట్టడం మరో విశేషం. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా.. సునీల్, లయ, వెన్నెల కిషోర్, రవి ప్రకాష్, తరుణ్ అరోరా, ఆదిత్య మీనన్, అభిమన్యు సింగ్, విక్రమ్ జిత్, రాజ్‌వీర్ సింగ్, శుభలేఖ సుధాకర్, శియాజీ షిండే తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు.
ప్లస్ పాయింట్స్
రవితేజ,ఇలియానా
సునీల్
ప్రొడక్షన్
కామెడీ
డైలాగ్స్

మైనస్ పాయింట్స్
సాంగ్స్
బోరింగ్ సన్నివేశాలు
సెకండ్ ఆఫ్
రేటింగ్ : 2.5/5