కొరటాలతో కాలభైరవ

SMTV Desk 2018-11-15 18:40:20  Koratala shiva, Ram charan

హైదరాబాద్, నవంబర్ 15: తండ్రికి తగ్గట్టు సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం లో ఆర్ ఆర్ ఆర్ తో బిజీ గా వున్నా విషయం తెలిసిందే. అయితే రైటర్ గా సూపర్ సక్సెస్ లను అందుకున్న కొరటాల శివ డైరక్టర్ గా మిర్చి నుండి భరత్ అనే నేను వరకు తన టాలెంట్ చూపుతున్నాడు. కొరటాల శివ సినిమా అంటే పక్కా హిట్ అన్న నమ్మకం వచ్చింది. అందుకే అతనితో సినిమా కోసం స్టార్స్ సైతం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరజీవి కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్న కొరటాల శివ ఆ సినిమా తర్వాత మళ్లీ మెగా హీరోతోనే సినిమా చేస్తాడని తెలుస్తుంది.

చిరు తర్వాత ఆ వెంటనే రాం చరణ్ తో కొరటాల శివ సినిమా ఉంటుందని అంటున్నారు. దీనికి సంబందించిన కథా చర్చలు కూడా ముగిశాయట. ప్రస్తుతం రాం చరణ్ బోయపాటి శ్రీను డైరక్షన్ లో వినయ విధేయ రామా సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత ఆర్.ఆర్.ఆర్ లైన్ లో ఉండనే ఉంది. సో ట్రిపుల్ ఆర్ తర్వాత చరణ్ కొరటాల శివ చేస్తాడన్నమాట. చరణ్ సినిమాల లిస్ట్ చూస్తుంటే వొకదానికి మించి మరోటి సంచలనాలు సృష్టించేలా ఉన్నాయి.