సావర్కర్ పై నోరు జారిన రాహుల్

SMTV Desk 2018-11-15 17:35:23  Rahul gandhi, Savarkar, Mumbai, Elections

ముంబై, నవంబర్ 15: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ మధ్య ఎన్నికల ప్రచారంలో హిందుత్వ ఐకాన్‌, స్వాతంత్ర స‌మ‌ర‌యోధుడు వీర్ సావర్క‌ర్‌పై నోరు జారాడు. జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు సావ‌ర్క‌ర్ బ్రిటీష‌ర్ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన‌ట్లు రాహుల్ ఆరోపణలు చేశారు. అయితే సావర్కర్ కుటింబీకులు రాహుల్ మాటలను ఖండించారు. ఆయ‌న మునిమ‌న‌వ‌డు రంజీత్ సావ‌ర్క‌ర్‌, రాహుల్‌పై కేసు కూడా న‌మోదు చేశారు. తమ ముత్తాత వీర్ సావ‌ర్క‌ర్‌పై రాహుల్ త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని ముంబైలోని శివాజీ పార్క్ పోలీసు స్టేష‌న్‌లో కాంప్లైంట్ ఇచ్చారు.

‘హిందూత్వ ఎజెండాకు వినాయ‌క్ దామోద‌ర్ సావ‌ర్క‌ర్ చాలా ప్ర‌చారం చేశారు. సావ‌ర్క‌ర్‌ను సుమారు 27 ఏళ్ల పాటు బ్రిటీష‌ర్లు జైల్లో పెట్టారు. అంత చేసిన సావ‌ర్క‌ర్‌ ప్ర‌తిష్టకు భంగం కలిగేలా రాహుల్ మాట్లాడారు అని తెలిపారు రంజీత్ సావర్కర్.