ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్న కేసిఆర్ ఆస్తులు, అప్పులు

SMTV Desk 2018-11-15 12:59:39  Telangana elections, Nominations, KCR, Assets, Liabelities

గజ్వేల్, నవంబర్ 15: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె చంద్రశేకర్ రావు నిన్న మధ్యాహ్నం గజ్వెల్ లో కేసీఆర్ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఎన్నికల అఫిడవిట్ లో భాగంగా ఆయన తన ప్రస్తుత ఆస్తులు, అప్పుల వివరాలను పేర్కొన్నారు. ఆ వివరాలు:

సిఎం కేసీఆర్‌ ఆస్తుల మొత్తం విలువ: రూ. 22,60,77,936.00
మొత్తం అప్పులు: రూ.1,07,47,570.00
చరాస్తులు: రూ. 10,40,77,946.00
స్థిరాస్తుల విలువ: రూ. 12.20 కోట్లు
ఫిక్సడ్ డిపాజిట్లు: రూ.5,63,73,946 .00
తెలంగాణ బ్రాడ్‌ కాస్టింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో పెట్టుబడులు- రూ.55,00,000
తెలంగాణ పబ్లికేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో పెట్టుబడులు- రూ.4,16,25,000
కేసీఆర్‌ వద్ద ఉన్న బంగారం- 75 గ్రాములు (విలువ రూ.2,40,000)
కేసీఆర్‌ అర్ధాంగి శోభ ఆస్తుల విలువ: రూ.94,59,779.00
బంగారం (2.2 కేజీలు) వజ్రాలు, ముత్యాలు వగైరా విలువ: రూ. 93,66,184.00
కేసీఆర్‌ చెల్లించవలసిన అప్పులు: ----
కుమారుడు కేటిఆర్‌కు చెల్లించాల్సిన బాకీ: రూ.82,82,570
కోడలు శైలిమకు చెల్లించాల్సిన బాకీ: రూ.24,65,000
భీమా పాలసీకి ఏడాదికి చెల్లిస్తున్న మొత్తం: రూ. 99,000.00
కెసిఆర్ పై నమోదైన కేసులు: -----
తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదు అయిన కేసులు: 64