త్వరలో ఏపి అసెంబ్లీ ఎన్నికలు

SMTV Desk 2018-11-14 14:11:33  Telangana elections, Andrapradhesh elections, Amaravati

అమరావతి, నవంబర్ 14: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు నామినేషన్ల వరకు వొచ్చాయి. అయితే పక్క రాష్ట్రమైన ఆంద్రప్రదేశ్ లో కూడా ఎన్నికల సమయం ఆసన్నమవుతుంది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కానున్నదట. ఈ విషయాన్ని ఎన్నికల ప్రధానాధికారి సిసోడియా వెల్లడించారు.

ఇప్పటి వరకు రాష్ట్రంలో 30 లక్షల మంది కొత్తగా ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్నారట. దీంతో ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 3.75 కోట్లకు చేరుకున్నదట. ఇక.. ఏపీలో ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు… త్వరలోనే ఏపీకి వీవీప్యాడ్ లను కూడా పంపిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈవీఎం సెక్యూరిటీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు సిసోడియా తెలిపారు. ఈవీఎంలను భెల్ కంపెనీకి పంపిస్తున్నట్లు ఆయన చెప్పారు.