ప్రభుత్వ నిర్ణయాన్ని ఎత్తివేసిన హై కోర్ట్

SMTV Desk 2018-11-14 12:39:29  High court, Hyderabad, Petitions, Indira park

హైదరాబాద్, నవంబర్ 14: నగరంలోని ఇందిరాపార్క్ వద్ద ధర్నాచౌక్ ను రాష్ట్ర ప్రభుత్వం నగర శివార్లకు తరలించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషనుపై మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు, ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. ఆరు వారాలపాటు ధర్నాచౌక్ వద్ద పరిస్థితులను పరిశీలించిన తరువాత ఆ ప్రాంతంలో ధర్నాచౌక్ ను కొనసాగించాలో వద్దో నిర్ణయిస్తామని హైకోర్టు తెలిపింది. కనుక నేటి నుంచి ఆరు వారాల పాటు ఉద్యోగ, కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు ధర్నాచౌక్ వద్ద మళ్ళీ ధర్నాలు చేసుకోవచ్చు.