అల్లూరి సీతారామరాజుగా చిరు

SMTV Desk 2018-11-13 14:49:36  Syera narshimhareddy, Chiranjeevi, Surendher reddy, Allori seetharamaraju

హైదరాబాద్, నవంబర్ 13: సురేందర్ రెడ్డి డైరక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహా రెడ్డి జార్జియాలో భారీ యుద్ధ సన్నివేశాలు చేసి ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ లో రాం చరణ్ నిర్మిస్తున్నాడు. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథతో వస్తున్న ఈ సినిమాలో చిరంజీవి అల్లూరి సీతారామరాజుగా కూడా కనిపిస్తారని తెలుస్తుంది.

నరసింహా రెడ్డిని బ్రిటీష్ వాళ్లు ఉరి తీస్తారు. అయితే అక్కడితో నరసింహా రెడ్డి కథ ముగిసినా ఆయన స్పూర్తితో తర్వాత స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపించిన అల్లూరి సీతారామరాజుగా కూడా కొంతసేపు మెగాస్టార్ చిరంజీవి కనిపిస్తారట. సూపర్ స్టార్ కృష్ణ కెరియర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే అల్లూరి సీతారామరాజుగా నటించి సాహసం చేశారు. ఆ తర్వాత సీనియర్ ఎన్.టి.ఆర్ కూడా అల్లూరిగా కనిపించారు. మరి ఇప్పుడు అల్లూరి గెటప్ లో చిరంజీవి ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటారో చూడాలి.