'ఇండియన్ 2' షురు

SMTV Desk 2018-11-12 19:00:49  Kamal hasan, Shankar, Bharatheyudu, Indian2

చెన్నై, నవంబర్ 12: లోకనాయకుడు కమల్ హాసన్, డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా ‘భారతీయుడు . తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఘన విజయం సాధించిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మరోసారి కమల్‌, శంకర్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా కావటంతో ‘భారతీయుడు-2 పై భారీ హైప్‌ క్రియేట్‌ అయ్యింది.ఇప్పటికే ‘2.ఓ కు సంబంధించిన పనులను పూర్తి చేశారు శంకర్‌. ఈ చిత్రం విడుదలైన తరువాత ‘ఇండియన్‌2 చిత్రాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే ‘ఇండియన్‌2 కు సంబంధించిన పూజాకార్యక్రమాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కమల్‌కు జోడిగా కాజల్‌ అగర్వాల్‌ నటించనున్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. కానీ​ చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం బయటకు రాలేదు. ఈ సినిమాలోని నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులకు సంబంధించిన విషయాలను త్వరలోనే మూవీయూనిట్‌ ప్రకటించనున్నట్లు సమాచారం.