భార్య పెరనున్నా సరే తప్పించుకోలేరు

SMTV Desk 2017-05-27 17:05:26  election,declaration,income source,maharastra,

న్యూఢిల్లీ, మే 25 : చట్టసభల ఎన్నికల్లో మరింత పారదర్శకమైన రీతికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎన్నికల్లో పోటి చేసే అభ్యర్థులు తమ ఆస్థులు, ఆదాయ వనరులతో పాటు జీవిత భాగస్వామి ఆదాయ వనరులను కూడా ప్రకటించాల్సి ఉంటుంది. ఈ మేరకు న్యాయ మంత్రిత్వ శాఖ నోటిఫై చేయడంతో ఇందుకు మార్గం సుగమం అయింది. గతంలో ఎన్నికల్లో పోటి చేసే అభ్యర్థి ఫాం 26లో నమోదు చేస్తే సరిపోయేది. అయితే ప్రస్తుతం డిక్లరేషన్ లోనే సమర్పించాల్సి ఉంటుంది. భారత రాజ్యాంగంలోని 19 (1)(ఎ) అధికరణం ప్రకారం భారత పౌరులకు ఎన్నికల్లో పోటీపడే అభ్యర్థుల పూర్తి వివరాలు తెలుసుకునే ప్రాథమిక హక్కు ఉంటుంది. అలా ఇవ్వకుండా వివరాలను దాచిపెట్టినా, తప్పుడు సమాచారం ఇచ్చినా, ఖాళీగా వదిలినా.. రిటర్నింగ్ అధికారి ఆ అభ్యర్థి దరఖాస్తు పరిశీలన దశలోనే తిరస్కరించవచ్చని అధికరణ స్పష్టం చేస్తోంది.. ఎన్నికల్లో పోటి చేసే అభ్యర్థుల పూర్తి సమాచారంకు సంబంధించి 2004లో సుప్రింకోర్టు తీర్పు వెలువరించింది. మహారాష్ట్ర లోని థానే జిల్లా అంబర్ పేట్ నియోజకవర్గం నుండి గెలుపొందిన కిషన్ శంకర్ రాథోడ్ తన ఇంటి విద్యుత్ బకాయిల గురించి, భార్యపిల్లల పేరనున్న ఆస్తుల వివరాలను, తన భాగస్వామ్య సంస్థ వివరాలను నామినేషన్ పత్రంలోని డిక్లరేషన్ లో పేర్కొనక పోవడంపై ప్రత్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఎన్నికల అధికారి నామినేషన్ పత్రాలను సరిగ్గా పరిశీలించలేదని, ఆ దరిమిలా ఆయన ఎన్నిక చెల్లదని అరుణ్ కుమార్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. కోర్టు విచారణ అనంతరం అందుకు సంబంధించి ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చింది. అయన భాగస్వామి, సంతానం కు సంబందించిన ఆస్తుల వివరాలను పేర్కొనక పోవడం తప్పుగా పరిగణించి ఎన్నికను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఒక వేళ ఎన్నికైన తర్వాతైన అనర్హతకు గురౌతారని సుప్రీమ్ కోర్టు కీలక తీర్పులో వెలువరించింది.