ఆర్.ఆర్.ఆర్ కోసం కొత్త భాష

SMTV Desk 2018-11-12 12:59:44  RRR, Junior NTR, Rajamouli, Ram charan,

బాహుబలి సీరీస్ ల తర్వాత రాజమౌళి చేస్తున్న మెగా నందమూరి మల్టీస్టారర్ సినిమా ఆదివారం మొదలైంది. అట్టహాసంగా మొదలైనె ఈ సినిమా నుండి కొన్ని లీక్స్ ఇప్పుడు టాలీవుడ్ ఆడియెన్స్ ను సర్ ప్రైజ్ చేస్తున్నాయి. ఇంతకీ అదేంటి అంటే.. బాహుబలి కోసం విలన్స్ కు కిలికి భాషని ప్రవేశపెట్టిన జక్కన్న ఇప్పుడు ట్రిపుల్ ఆర్ కోసం మరో కొత్త భాషని సిద్ధం చేస్తున్నారట.

బాహుబలిలో కిలికి భాషని ప్రవేశపెట్టిన తమిళ నటుడు కార్కీ సహకారంతో తెలుగు రచయిత సాయి మాధవ్ బుర్ర కూడా ఈ కొత్త భాష కోసం పనులు మొదలు పెట్టాడట. సినిమాలో ఈ భాషని ఎన్.టి.ఆర్ మాట్లాడుతాడని తెలుస్తుంది. ఇక తెలుస్తున్న సమాచారం ప్రకారం సినిమాలో ఎన్.టి.ఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడని తెలుస్తుంది. ట్రిపుల్ ఆర్ అంటే రామ రావణ రాజ్యం అని రాజమౌళి ఫిక్స్ చేశాడని అంటున్నారు.

డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 300 కోట్ల భారీ బడ్జెట్ తో రాబోతుంది. ఎన్.టి.ఆర్, చరణ్ కలిసి చేస్తున్న ఈ మల్టీస్టారర్ సినిమా నవంబర్ 19 నుండి రెగ్యులర్ షూట్ కు వెళ్తుంది.