వినయ విధేయ రామ రికార్డులు

SMTV Desk 2018-11-11 11:40:00  Ram charan, Vinaya Vidheya Rama, Boyapati

హైదరాబాద్, నవంబర్ 11: మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, మాస్‌ యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘వినయ విధేయ రామ . డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్‌ శుక్రవారం రిలీజ్‌ అయ్యింది. బోయపాటి మార్క్ మాస్‌ యాక్షన్‌ సీన్స్‌తో రూపొందించిన ఈ టీజర్‌ మెగా అభిమానులను అలరిస్తోంది.

అంతేకాదు ఈ టీజర్‌ కేవలం 24 గంటల్లో 15.1 మిలియన్ల( కోటీ 50 లక్షలకు పైగా) డిజిటిల్ వ్యూస్‌ సాధించి రికార్డ్‌ సృష్టించింది. ధృవ, రంగస్థలం సినిమాలతో ప్రయోగాలు చేసిన చరణ్‌ ఈ సారి పక్కా కమర్షియల్ సినిమాతో అలరించనున్నాడు. ఈ సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాలో ప్రశాంత్‌, ఆర్యన్ రాజేష్‌ కీలక పాత్రల్లో నటిస్తుండగా బాలీవుడ్ నటుడు వివేక్‌ వొబెరాయ్‌ విలన్‌ పాత్రలో కనిపించనున్నాడు.