ఎగ్జిట్‌ పోల్స్‌పై ఈసీ నిషేదం

SMTV Desk 2018-11-11 11:26:35  elections, kcr,

హైదరాబాద్, నవంబర్ 11: డిసెంబరు 12న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది గనుక ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి డిసెంబరు 7వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు పోలింగ్ పూర్తయ్యే వరకు రాష్ట్రంలో ఏ సంస్థలు ఎన్నికల సర్వేల ఫలితాలు ప్రకటించరాదని రాష్ట్ర ఎన్నికల సంఘం ఈరోజు నోటీసు జారీ చేసింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్‌ 126ఏ ప్రకారం ఈ ఆంక్షలు అమలుచేయబోతున్నట్లు పేర్కొంది. అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఎన్నికల ఫలితాలకు సంబందించి ఎటువంటి ఊహాగానాలు లేదా కధనాలు ప్రసారం చేయరాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

కొన్ని పత్రికలు, మీడియా సంస్థలు ఏదో వొక పార్టీకి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా వార్తలు, కధనాలు ప్రసారం చేస్తుండతం అందరూ చూస్తూనే ఉన్నారు. కనుక వాటి సర్వే నివేదికల విశ్వసనీయతపై ప్రజలు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పార్టీలు కూడా ఓటర్లను ప్రభావితం చేసేందుకు తమకు అనుకూల మీడియాతో అనుకూలంగా సర్వే నివేదికలు ప్రకటింపజేసుకోవడం సర్వసాధారణమైన విషయంగా మారిపోయింది. కనుక పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు వాటిని నిషేదించడం అవసరమే. అప్పుడే ప్రజలు రాజకీయ పార్టీల మంచి చెడ్డలు బేరీజు వేసుకొని తమకు నచ్చిన పార్టీలకు ఓట్లు వేయగలుగుతారు.