'సర్కార్' రివ్యూ..

SMTV Desk 2018-11-08 10:49:34  sarkaar, Thalapathy Vijay, Sarkar Review

టైటిల్ : సర్కార్‌
జానర్ : యాక్షన్‌ డ్రామా
తారాగణం : విజయ్‌, కీర్తీ సురేష్‌, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, యోగిబాబు
సంగీతం : ఏఆర్‌ రెహమాన్‌
దర్శకత్వం : ఏఆర్‌ మురుగదాస్‌
నిర్మాత : కళానిధి మారన్‌

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, అగ్ర దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన సర్కార్ సినిమా దీపావళి కానుకగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ మరో ముఖ్య పాత్రలో కనిపించనుంది.

ఈ సినిమాపై అటు తమిళంలో ఇటు తెలుగులో కూడా హైప్ క్రియేట్ అయింది. విజయ్-మురుగదాస్ కాంబినేషన్ లో ఇప్పటివరకు వచ్చిన తుపాకీ , కత్తి వంటి సినిమా ఘన విజయం సాధించడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలను సర్కార్‌ అందుకుందా..? ఈ సినిమాతో అయినా విజయ్‌ తెలుగు మార్కెట్‌లో జెండా పాతాడా..? స్పైడర్‌ సినిమాతో టాలీవుడ్‌కు షాక్‌ ఇచ్చిన దర్శకుడు మురుగదాస్‌, సర్కార్‌తో ఆకట్టుకున్నాడా..?

కథ ;

సుందర్‌ రామస్వామి (విజయ్‌) సంవత్సరానికి 1800 కోట్లు సంపాదించే బిజినెస్‌మేన్‌. తను ఏ దేశంలో అడుగుపెట్టిన అక్కడి కంపెనీలను దెబ్బతీసి, వాటిని మూసేయించే కార్పోరేట్‌ క్రిమినల్‌. అలాంటి సుందర్‌ భారత్‌కు వస్తుండన్నా సమాచారంతో ఇక్కడి కార్పోరేట్ కంపెనీలన్ని ఉలిక్కి పడతాయి. కానీ ఇండియా వచ్చిన సుందర్‌ కేవలం తన ఓటు హక్కును వినియోగించుకోవడానికే వచ్చానని చెప్పటంతో అంతా ఊపిరి పీల్చుకుంటారు.

ఓటు వేయడానికి వెళ్లిన సుందర్‌కు తన ఓటును ఎవరో దొంగ ఓటు వేశారని తెలుస్తుంది. దీంతో తన ఓటు కోసం కోర్టును ఆశ్రయిస్తాడు. సుందర్‌ ఓటు హక్కు వినియోగించుకునే వరకు అక్కడ ఎలక్షన్‌ కౌంటింగ్ ఆగిపోతుంది. సుందర్‌ విషయం తెలిసి ఓటు వేయలేకపోయిన దాదాపు 3 లక్షల మందికిపైగా ప్రజులు అదే తరహాలో కేసుల వేస్తారు. దీంతో ఎలక్షన్‌లను రద్దు చేసి తిరిగి 15 రోజుల్లో ఎన్నికల నిర్వహించాలని కోర్టు తీర్పునిస్తుంది. తరువాత అధికారి పార్టీ నేతలతో గొడవల కారణంగా సుందర్‌ స్వయంగా ఎలక్షన్‌లలో పోటీ చేయాలని నిర్ణయించుకుంటాడు. కార్పోరేట్ క్రిమినల్‌గా పేరు తెచ్చుకున్న సుందర్‌ ఇక్కడి కరుడు గట్టిన రాజకీయనాయకులతోఎలా పోరాడాడు? పోటికి దిగిన సుందర్‌కు ఎదురైన సమస్యలేంటి.? అన్నదే మిగతా కథ.

విశ్లేషణ ;

కత్తి, తుపాకి లాంటి బ్లాక్‌బస్టర్స్‌ అందించిన కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావటంతో సర్కార్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సారి మురుగదాస్‌, విజయ్‌లు ఆ స్థాయిలో అలరించలేకపోయారు. విజయ్‌ మార్క్‌ స్టైల్స్‌, మాస్‌ అప్పీల్ కనిపించినా.. మురుగదాస్‌ గత చిత్రాల్లో కనిపించి వేగం ఈ సినిమాలో లోపించినట్టుగా అనిపిస్తుంది. ఓ కార్పోరేట్ క్రిమినల్‌, రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చాడు అన్న ఇంట్రస్టింగ్ పాయింట్‌ను తీసుకున్న దర్శకుడు కథనాన్ని చాలా నెమ్మదిగా నడిపించాడు.

నటీనటుల విషయానికి వస్తే విజయ్‌ మార్కు మేనరిజమ్స్‌ నచ్చే వారికి అతని శైలి నచ్చాలి. అతడితో పెద్దగా పరిచయం లేని వారికి అవి విచిత్రంగా తోచే అవకాశముంది. కీర్తి సురేష్‌ కేవలం హీరోయిన్‌ స్లాట్‌ ఫిల్‌ చేయడానికే వుంది. వరలక్ష్మి శరత్‌కుమార్‌ నటన బాగానే వుంది. మిగతా వాళ్లలో రాధా రవి నటన మెప్పిస్తుంది. పాటలు అవసరం లేదని భావించడం వలనో ఏమో రహమాన్‌ వీలుంటే ఎడిట్‌ చేసేసుకునే పాటలు చేసిచ్చాడు.

ప్లస్‌ పాయింట్స్‌ ;
విజయ్‌ నటన
యాక్షన్‌ సీన్స్‌
నేపథ్య సంగీతం

మైనస్‌ పాయింట్స్‌ ;
లాజిక్‌ లేని సీన్స్‌
స్లో నేరేషన్‌