వరంగల్ జైల్లో మారుతిరావు

SMTV Desk 2018-11-01 16:22:02  Pranay murder, Maruthirao, High court, Warangal Jail

హైదరాబాద్ : హైకోర్టు ప్రణయ్ పరువు హత్య కేసు నిందితులను వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే ఆ నిందితులకి ఎట్టి పరిస్థితిల్లో బెయిల్ ఇవ్వడానికి వీల్లేదని మారుతీరావు కుమార్తె అమృత వర్షిణి, కోర్టును కోరిన విషయం తెలిసిందే. మొత్తం ఆరుగురు నిందితుల్లో ముగ్గురు నిందితులపై పీడీయాక్ట్ కేసు నమోదు చేసిన పోలీసులు వారిని మిర్యాలగూడ నుంచి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు.

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. ఏ1గా తిరునగరి మారుతీరావు, ఏ5గా ఎమ్డీ అబ్దుల్ కరీం, ఏ6 ఉన్న తిరునగరి శ్రవణ్ కుమార్‌లను బుధవారం వరంగల్ సెంట్రల్ జైలుకు తీసుకువచ్చారు.సంవత్సరం వరకు ఈ ముగ్గురు పీడి యాక్ట్‌లో వరంగల్ జైల్లోనే వుంటారని డీఐజీ మురళీబాబు తెలిపారు.వరంగల్ సెంట్రల్ జైలులో ఈ ముగ్గురికి వేర్వేలు బ్యారక్‌లు కేటాయించామని పేర్కొన్నారు.