సంచలన వ్యాఖ్యాలు చేసుకుంటున్న ప్రముఖ నటీమణులు

SMTV Desk 2018-11-01 15:43:48  Tanu Sri Dutta, Nana Patekar, Rakhi Savanth, Mee Too, Rape, Lesbians

ముంబై, నవంబర్ 4: ప్రముఖ బాలీవుడ్ నటి తనూశ్రీ దత్తా రేపిన ‘మీటూ’ వివాదం రోజురోజుకూ పెరుగుతూ పోతుంది. నానా పటేకర్ తనను లైంగికంగా వేధించాడని తనుశ్రీ ఆరోపించించడం తెలిసిందే. ఈ అంశంపై ప్రారంభం నుండి ఐటం గర్ల్ రాఖీ సావంత్, తనుశ్రీ మీద తీవ్ర విమర్శలు చేస్తూ వస్తోంది. తనుశ్రీ తనను రేప్ చేసిందని, ఆమె వొక లెస్బియన్ అని, డ్రగ్స్‌కు బానిస అని ఆరోపించింది.





అయితే తనుశ్రీ, రాఖీ ఆరోపణలను లైట్ తీసుకోలేదు. సీరయస్‌గానే తీసుకుంది. తన పరువుకు భంగం కలిగించిందని, ఆమె మీద రూ.10కోట్ల దావా వేస్తున్నట్టు ప్రకటించింది. డబ్బు సంపాదన కోసం రాఖీ ఎంతకైనా దిగజారుతుందనీ, ఎలాంటి నీచమైన పనులైనా చేస్తుందని తనుశ్రీ ఆరోపించింది. తనుశ్రీ వేసిన దావాపై రాఖీ స్పందించకపోతే రెండేళ్ల జైలుశిక్ష విధించే అవకాశం ఉందని ఆమె తరపు న్యాయవాది నితిన్ మీడియాతో వెల్లడించారు. తనుశ్రీ దావాపై రాఖీ ఎలా స్పందిస్తుందని చాలా మంది ఆసక్తిగా చూశారు.

రాఖీ కూడా రివర్స్‌గా తనుశ్రీపై పరువు నష్టం దావా వేసింది. తన పరువును తనుశ్రీ బజారుకీడ్చిందని రాఖీ అందులో ఆరోపించింది. . మరి ఆమె వేసిన దావా ఎంతో తెలిస్తే షాక్ అవాల్సిందే. పావలా (25 పైసలు) దావా వేస్తున్నట్టు ప్రకటించింది రాఖీ. ‘ఆర్థికంగా భారీ నష్టాల్లో ఉన్నాను. భారీగా నష్టపరిహారం కోరి మరింత కష్టాల్లో పడలేను. కానీ, ఎన్నో ఏళ్లుగా కాపాడుకున్న నా పరువూ, మర్యాదలను తనుశ్రీ నాశనం చేయాలని చూస్తోంది. ఆమె వ్యాఖ్యలను తిప్పికొట్టేందుకే ఈ దావా వేశాను’ అని రాఖీ తెలిపింది.