నిరుద్యోగులకు జంబో ప్యాకేజి, 20 వేల ఉద్యోగాల ప్రకటనకు రంగం సిద్ధం.

SMTV Desk 2017-05-30 18:30:17  jobs, recrutement, ts jobs,recrute ment

హైదరాబాద్, మే 30 : నిరుద్యోగుల నుండి తీవ్ర అసంతృప్తి ఎదుర్కుంటున్న తెలంగాణా ప్రభుత్వం వారిని బుజ్జగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.ఇందులో భాగంగా ఉద్యోగ ప్రకటనలతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు రంగం సిద్దం చేసింది. ఇందుకు రాష్ట్రావతరణ దినోత్సవ వేదికను..తెలంగాణ సెంటిమెంట్ ను సోమ్ము చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఏకంగా 20 వేలకు పైగా ఉద్యోగాల తో కూడిన ప్రకటనలు జారీ చేసేందుకు అన్ని రకాల ఏర్పాటు పూర్తి చేసుకున్నట్లు సమాచారం. అత్యధికంగా ఉపాధ్యాయ పోస్టులు కాగా మిగితావి వివిధ శాఖల భర్తీలు కావచ్చునని భావిస్తున్నారు.