వణుకు పుట్టిస్తున్న వంటగ్యాస్ ధరలు

SMTV Desk 2018-11-01 12:55:40  Coocking Gas, Prices, Oil Corporation, GST, LPG Gas

న్యూ ఢిల్లీ, నవంబర్ 1: సిలిండర్ ధరలు మల్లీ విజృన్భించాయి. గత రెండు మూడు నెలలుగా పెరుగుతూ వస్తున్న వంటగ్యాస్ సిలిండర్ ధరలు బుధవారం మరోసారి పెరిగాయి. సబ్సిడీ సిలిండర్‌పై రూ.2.94లు, సబ్సిడీ లేని ఎల్పీజీ సిలిండర్ ధర రూ.60 మేర పెరిగిందిపెరిగిన ధరలు నవంబర్ నెల నుంచి అమలులోకి వస్తాయని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ప్రకటించింది.

అంతర్జాతీయంగా పెరిగిన గ్యాస్ ధరలు, విదేశీ మారక ద్రవ్యంలో నెలకొన్న అస్థిరత కారణంగానే ధరలు పెరిగినట్టు ఆయిల్ కార్పోరేషన్ పేర్కొంటుంది. సబ్సిడీ సిలిండర్ వినియోగిస్తున్నవారిపై జీఎస్‌టీ వల్లనే ఈ భారం పడుతున్న ఆ కంపెనీ పేర్కొనడం గమనార్హం. పెరిగిన ధరల రీత్యా.. ఢిల్లీ వాసులకు అక్టోబర్‌లో రూ.502.34కి లభించిన సబ్సిడీ సిలిండర్ నవంబర్‌లో రూ.505.34 కానుంది.