ప్రభాస్ అభిమానులకి కన్నుల పండుగే

SMTV Desk 2018-10-31 16:35:34  Sukumar, Prabhas, Mahesh babu, Rangasthalam

ఫిలిం నగర్, అక్టోబర్ 31: తెలుగు చిత్ర పరిశ్రమలో సుకుమార్ తనదైన పద్దతిలో సినిమాలు తీస్తూ తనకంటూ వొక మార్క్ సంపాదించుకున్న దర్శకుడు. తాజాగా అతని దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం మూవీ అతని పూర్వ చిత్రాలతో చూస్తే ఇది చాలా భిన్నమైన చిత్రంగా చెప్పుకోవచ్చు. కాగా రంగస్థలం సినిమా బాక్ష్ ఆఫీస్ వద్ద ఊహించని విదంగా వసూళ్లు రాబట్టింది. రంగస్థలం తర్వాత మహేష్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు సుకుమార్. ఇప్పటికే మహేష్ ను మెప్పించే కథ కోసం తన టీంతో డిస్కషన్స్ చేస్తున్నాడు. ఇదిలాఉంటే మహేష్ తర్వాత సుకుమార్ ప్రభాస్ తో సినిమా చేస్తాడని లేటెస్ట్ టాక్. ఆర్య కథ అల్లు అర్జున్ కంటే ముందు ప్రభాస్ కే వినిపించాడట సుకుమార్ అయితే అది తనకి సూట్ అవదని వద్దన్నాడట.

రంగస్థలం సినిమా చూసి సుక్కుకి ప్రత్యేకంగా ఫోన్ చేసి మెచ్చుకున్న ప్రభాస్ తనకు అలాంటి కథ వొకటి సిద్ధం చేయమని అన్నాడట. మహేష్ సినిమా తర్వాత ప్రభాస్ తోనే సుక్కు సినిమా ఉంటుందని ఫిక్స్ అవ్వొచ్చు. ఇప్పటికే ప్రభాస్ అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు సుక్కు ప్రభాస్ కాంబినేషన్ కోసం. ఇక ఆ సినిమా కానీ సెట్స్ పైకి వెళ్తే అభిమానులకి పండగే.