‘భారతీయుడు-2’ లో అందాల తార

SMTV Desk 2018-10-31 13:12:35  Kamal hasan, Shankar, Kajal agarwal, Bharatheeyudu

చెన్నై, అక్టోబర్ 31: లోకనాయకుడు కమల్ హాసన్, డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా ‘భారతీయుడు’. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఘన విజయం సాధించిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. మరోసారి కమల్‌, శంకర్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా కావటంతో ‘భారతీయుడు-2’ పై భారీ హైప్‌ క్రియేట్‌ అయ్యింది.

త్వరలో సెట్స్‌ మీదకు వెళ్లనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో కమల్‌కు జోడిగా కాజల్‌ అగర్వాల్ నటించనున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగులో చిరంజీవి లాంటి సీనియర్ల సరసన నటించిన కాజల్‌, కమల్‌ సరసన నటించే అవకాశం రావటంతో వెంటనే ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది.