ఎన్టీఆర్ బయోపిక్ వాయిదా

SMTV Desk 2018-10-31 11:31:30  NTR, Ram gopal varma, Postpone

ఫిలిం నగర్, అక్టోబర్ 31: నందమూరి తారక రామారావు గారి జీవితాదారంగా తెరకెక్కుతున్న చిత్రం ఎన్.టి.ఆర్. అయితే ఈ చిత్రాన్ని రెండు బాగాలుగా చేసి విడుదల చేస్తున్నారన్న విషయం తెలిసిందే. ఇందులోని మొదటి బాగం ఎన్.టి.ఆర్ కథానాయకుడు సంక్రాంతి కానుకగా వస్తుండగా మహానాయకుడు సినిమాను జనవరి 24న రిలీజ్ ప్లాన్ చేశారు. అయితే రెండో బాగం విడుదల రోజే రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ మూవీ కూడా విడుదల చేస్తా అని ప్రకటించాడు.

కాగ ఎన్.టి.ఆర్ మహానాయకుడు మూవీ రిలీజ్ వాయిదా వేస్తున్నారని సమాచారం. ఫిబ్రవరిలో ఆ సినిమా వస్తుందని తెలుస్తుంది. వర్మ సినిమాకు భయపడి కాదు రెండు సినిమాలకు కనీసం వొక నెల అయినా గ్యాప్ ఉండాలన్న ఉద్దేశంతో మహానాయకుడు సినిమా వాయిదా వేస్తున్నారట.