మలయాళంలోకి రామ్ చరణ్ చిత్రం

SMTV Desk 2018-10-30 19:43:16  Rangasthalam, Sukumar, Malayalam, ram charan

హైదరాబాద్ , అక్టోబర్ 30: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ కలిసి చేసిన రంగస్థలం చిత్రం ఎంతటి భారీ విజయాన్ని దక్కించుకుందో తెలిసిన సంగతే. సుమారు 120 కోట్ల షేర్ రాబట్టిన ఈ సినిమా ఇండస్ట్రీలో నాన్ బాహుబలి రికార్డుల్ని క్రియేట్ చేసింది. ఇప్పుడీ చిత్రాన్ని మలయాళంలోకి అనువదించారు.

నవంబర్ నెలలో కేరళలో భారీ ఎత్తున ఈ చిత్రం విడుదలకానుంది. తెలుగు సినిమాలకు కేరళలో ఆదరణ పెరిగిన నేపథ్యంలో ఈ చిత్రం అక్కడ కూడ భారీ లాభాలని వసూలు చేస్తుందని డిస్ట్రిబ్యూటర్లు భావిస్తున్నారు. సమంత కథానాయకిగా నటించిన ఈ విలేజ్ డ్రామాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.