పోలీసులకు షాకిచ్చిన ఓ యువతీ

SMTV Desk 2018-10-30 16:06:54  Being viral, Viral vedios, Mumbai, Meghasharma ,Model

ముంబై, అక్టోబర్ 30: మేఘాశర్మ అనే వర్ధమాన మోడల్ ముంబైలోని ఖండ్ వాలా కాంప్లెక్స్ లో పెయింగ్ గెస్ట్ గా ఉంటోంది. అక్టోబర్ 25 అర్ధరాత్రి సమయంలో సెక్యూరిటీ గార్డ్ అలోక్ కు ఫోన్ చేసి ఓ సిగరేట్ ప్యాకెట్ తెచ్చి ఇవ్వాలని కోరింది. అప్పటికే సమయం అర్ధరాత్రి 12 దాటేసరికి ఈ సమయంలో దొరకవని చెప్పాడు. దానికి ఆమె కోపం తో కిందకి వొచ్చి అతనితో గొడవకు దిగి, అతని పై చెయ్యి కూడా చేసుకుంది. తర్వాత అతడు పోలీసులకి ఫిర్యాదు చేసాడు. వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని, ఆమెను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. అర్ధరాత్రి రానని.. ఉదయం వస్తానని ఆమె స్పష్టం చేసింది. మహిళా కానిస్టేబుల్ కూడా లేదని.. ఎలా రావాలని ప్రశ్నించింది.
కానీ పోలీసులు వొప్పుకోకుండా స్టేషన్ కు రావాల్సిందేనని డిమాండ్ చేశారు. దీంతో మేఘాశర్మ .. పోలీసులతో తీవ్ర వాగ్వాదం పెట్టుకుంది.పోలీసులను అక్కడి నుంచి పంపించేయాలన్న ఉద్దేశంతో వొంటిపై ఉన్న దుస్తులను వొక్కొక్కటిగా విప్పుతూ బెదిరించసాగింది. ఇలా అర్ధరాత్రి నగ్నంగా ఆమె చేస్తున్న రచ్చకు భయపడి పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కానీ అక్కడే ఉన్న స్థానికులు దీన్ని వీడియో తీసి షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అనంతరం మేఘాశర్మ ముంబై పోలీసుల తీరును ఎండగడుతూ ట్వీట్ చేసింది.రాత్రి 7 గంటల తర్వాత మహిళలను అరెస్ట్ చేయరాదని..కానీ అర్ధరాత్రి 3 గంటలకు తనను అదీ మహిళా పోలీస్ లేకుండా అరెస్ట్ చేసేందుకు వచ్చిన ముంబై పోలీసుల పనితీరు ఇదీ అంటూ వ్యాఖ్యానించింది. పోలీసులతో వాదించే ఓపిక లేక.. విసుగుచెంది.. వారిని పంపించేయడానికి తాను బట్టలు విప్పి అలా చేశానని వివరించింది.