త్వరలో కెసిఆర్ బయోపిక్ ప్రధాన పాత్రలో ప్రముఖ సినీ నటుడు

SMTV Desk 2018-10-30 13:39:59  KCR, Srikanth, NTR, Krish, Mahanati, KCR Biopic

హైదరాబాద్, అక్టోబర్ 30: ప్రస్తుతం సినీ పరిశ్రమలో జీవితాధారంగా తెరకెక్కుతున్న చిత్రాలు మంచి లాభాలను తెచ్చిపెట్టడంతో పరిశ్రమలోని అందరు వాటికే ఎక్కువ ఆకర్షితులవుతున్నారు. తాజాగా మహానటి సావిత్రి జీవితాధారంగా తీసిన చిత్రం మహనటి ఈ చిత్రం వూహించని వసూళ్లు వసూళ్లు రాబట్టింది. దాని తరువాత క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఎన్టీయార్ ఈ చిత్రం మహానుభావుడైన నందమూరి తారక రామారావు గారి జీవితాధారంగ వస్తుంది. ఇలా ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా సినిమాలు వస్తున్నాయి.

తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారి జీవితాధారంగా వొక సినిమాని తీస్తున్నారని వార్తలొస్తున్నాయి. అయితే ఈ వార్తలు నిజమే అని 100 సినిమాలకు పైగా నటించిన శ్రీకాంత్ స్వయంగా ఈ విషయాన్ని వెళ్లడించారు. అయితే కె.సి.ఆర్ పాత్రలో శ్రీకాంత్ గారే నటిస్తున్నారట. శ్రీకాంత్ నటించిన ఆపరేషన్ 2019 సినిమా రిలీజ్ కు రెడీ అవుతుండగా ఆ సినిమా ప్రమోషన్స్ లో కె.సి.ఆర్ బయోపిక్ గురించి ప్రస్థావించాడు.

కె.సి.ఆర్ బాల్యం నుండి సిఎంగా తెలంగాణా రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేసిన ఎపిసోడ్ వరకు సినిమా ఉంటుందని అన్నారు. తెలంగాణా పోరాట నేపథ్యంలో ఎన్.శంకర్ జై బోలో తెలంగాణా సినిమా చేశాడు. ఆ సినిమాలో జగపతి బాబు నటించడం జరిగింది. అయితే ఇప్పుడు తెలంగాణా రాష్ట్ర సాధనకు కారణమైన కె.సి.ఆర్ జీవిత చరిత్ర ఎలా ఉండబోతుందో చూడాలి.