చాలా సంతోషంగా ఉంది : షోయెబ్ మాలిక్

SMTV Desk 2018-10-30 11:41:48  sania mirza, shoaib malik, born a baby,

ఇస్తాంబుల్, అక్టోబర్ 30: భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు మగ బిడ్డ జన్మించాడు. ఈ విషయాన్నీ తన భర్త షోయెబ్ మాలిక్ సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ శుభవార్త మీ అందరితో పంచుకోబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు మగబిడ్డ పుట్టాడు. సానియా చాలా ఆరోగ్యంగా ఉంది. మీ అందరి ప్రేమ, ఆశీస్సులను ధన్యవాదాలు అంటూ షోయబ్ తెలిపాడు. దీంతో పాటు బేబీ మీర్జా మాలిక్ అని హ్యాష్‌ట్యాగ్ పెట్టాడు. ఈ విషయం తెలిసినవారందరు వారిద్దరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు. కాగా 2010లో షోయబ్, సానియాల వివాహం జరిగిన విషయం తెలిసిందే.