ఏపీ సీఎంపై మండిపడ్డ లక్ష్మీపార్వతి

SMTV Desk 2018-10-29 18:08:03  ntr, laxmi parvati, chandrababu naidu, ysrcp jagan

అమరావతి, అక్టోబర్ 29: ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పై మండిపడ్డారు. బాబుకు ప్రత్యక్ష రాజకీయాలు తెలియవని, ఆయనకు తెలిసిందల్లా వెన్నుపోటు, హత్యా రాజకీయాలు మాత్రమేనని అన్నారు. ప్రతిపక్ష నేత జగన్‌పై దాడి విషయంలో చంద్రబాబు, లోకేశ్‌ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. స్నేహితుడి కొడుకుపై కూడా హత్యా రాజకీయాలు చేస్తావా బాబూ’ అంటూ ఆమె ప్రశ్నించారు. నీ 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో నీ కొడుకు వయసున్న జగన్‌పై హత్యాయత్నం చేయిస్తావా? రాష్ట్రంలో అసమర్ధ పాలన సాగుతోంది.

చంద్రబాబు నువ్వు హడావిడిగా ఢిల్లీకి ఎందుకు పరిగెత్తావ్? పనికిమాలిన నీ కొడుకును ప్రజలపై రుద్దడం కోసం ఇంత దారుణం చేస్తావా? నిసిగ్గుగా అబద్దాలు చెప్తున్న చంద్రబాబు ఇప్పటికైనా నువ్వు హత్యా రాజకీయాలు ఆపు. చంద్రబాబు జీవితంలో ఇదే చివరి అంకం. చంద్రబాబు నువ్వు అడవిలో జంతువులా బతుకు, సమాజంలో బతికే అర్హత కోల్పోయావ్. అంటూ తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం ప్రకటించారు.