ఖమ్మం జిల్లాలో కలకలం

SMTV Desk 2018-10-29 12:33:48  batukamma sarries, election code,

ఖమ్మం, అక్టోబర్ 29: ఖమ్మం జిల్లాలో శుక్రవారం వొక లారీలో బతుకమ్మ చీరలను తీసుకువెళుతున్నట్లు సమాచారం అందడంతో ప్రతిపక్షనేతలు వైరా రోడ్డులో గల రేణుక జిన్నింగ్ మిల్లు వద్ద ఆ లారీని పట్టుకొన్నారు. దానిలో 25,120 బతుకమ్మ చీరలున్నాయి. వాటిని తెలంగాణ రాష్ట్ర హ్యాండ్లూం కో-ఆపరేటివ్ లిమిటెడ్ నుంచి లక్ష్మీదేవిపల్లి మార్కెట్ గోదాముకు తరలిస్తున్నట్లు వే-బిల్స్ ఉండటంతో ప్రతిపక్ష నేతలు శాంతించారు.ఈ సంగతి తెలుసుకొని ఖమ్మం ఏసీపీ వెంకట్రావ్ అక్కడకు చేరుకొని, లారీ డ్రైవర్ నుంచి వే-బిల్ తీసుకొని పరిశీలించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి జీ.గోపాల్ పేరుతో ఆ బిల్లు ఉండటం, బిల్లులో పేర్కొన్నట్లుగా లారీలో 25,120 బతుకమ్మ చీరలు మాత్రమే ఉన్నాయని నిర్ధారించుకొన్నారు. అయినప్పటికీ ప్రతిపక్ష నేతల అనుమానాలు నివృత్తి చేసేందుకు లారీలోని ఆ చీరలనన్నిటినీ క్రిందకు దింపించి తనికీ చేశారు. ఆ చీరల బస్తాలలో డబ్బు లేదని నిర్ధారించుకొన్నాక ఆ వాహనాన్ని విడిచిపెట్టారు.