కెసీఅర్ ని ప్రసంశించిన మోది. మరి బాబుని ...?

SMTV Desk 2018-10-29 12:05:37  narendra modi, chandrababu naidu, kcr

న్యూ ఢిల్లీ , అక్టోబర్ 29:ఢిల్లీలో మీడియా సమావేశంలో మరోసారి చంద్రబాబునాయుడు కేసీఆర్‌కు వస్తున్న ప్రశంసలు గురించి మాట్లాడారు. పైగా మోడీ తెలుగు రాష్ట్రాల్లో వొక సీఎంను మెచ్చుకుని మరొకరిని వదిలేస్తే ఎలా అన్నట్లుందాయన ధోరణి అని తెలుగు ప్రజలు అనుకుంటున్నారు. ఈ మధ్య చంద్రశేఖర్ రావు పరిపక్వత ఉన్న నాయకుడని మోదీ అన్నారు. అంటే నాకు పర్విపక్వత లేదు అని మీరు ప్రశ్నిస్తున్నారు. మోదీ ఎందుకు అన్నారో. ఏ విషయంలో అన్నారు. ఏం చూశారో. నాలుగేళ్ల కాలంలో రాష్ట్రాన్ని గాడిలో పెట్టినందుకే అలా చెప్పారో తెలియదు కదా. పైగా నిధులు కోసం కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడి వాళ్లను తిట్టే కంటే వారిచ్చినా ఇవ్వకున్నా సొంతంగ వనరులు ఉత్పత్తి చేసుకుంటున్నారు. తాను చేయదల్చుకున్న కార్యక్రమాలు, స్కీంలు అమలుచేసుకుంటూ పోతున్నారు.సీనియర్ మోస్ట్ సీఎంకు రాని ప్రశంసలు కేసీఆర్‌కు వచ్చాయి.

వాస్తవంగా చెప్పాలంటే కొద్ది కాలంలోనే ఓ రాష్ట్రాన్ని తమది పాత రాష్ట్రమే… తామూ పరిపాలన చాలా బాగా చేయగలం. తమ గురించి తాము ఆలోచించుకోగలం అనే విశ్వాసాన్ని కేసీఆర్ ఇక్కడి జనాల్లో కల్పించారు. మోదీనే కాదు యావత్ దేశం అంతా ఆయన గురించి మాట్లాడింది.. అవార్డులిచ్చింది.మీకు అవార్డులు రాకపోతే పోయే గానీ, పక్క రాష్ట్రం సీఎం పనితీరును మెచ్చి మెచ్చుకుంటారు.. అవార్డులిస్తారు. అయినా ప్రతిదానికి కేసీఆర్ పోలిక ఎందుకు. పక్క రాష్ట్రం రాజకీయాల్లో వేలు పెట్టాలని ఎందుకు అనుకుంటున్నారు. ప్రతీది తెలంగాణ రాష్ట్రంతో ఎందుకు పోల్చుకుంటున్నారు. మీడియా మీట్ పెట్టేదే పాపం. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది టిడిపినే అంటారు. అందునా తాను మాత్రమేనని వందసార్లు అన్నారు.

అంతేకాదు కేసీఆర్‌ను లీడర్‌గా తయారు చేసిందీ తమరే అని సెలవిచ్చుకున్నారు. అయితే కావొచ్చు. మీరు తయారు చేసిన నాయకుణ్ణి మెచ్చుకుంటే ఇంతలా ఎందుకు బాధపడ్తారు. మోదీ తెలంగాణ ప్రగతి గురించి మాట్లాడినా అంతా తామే చేశామని అంటారు.ఇలా ప్రతీ సందర్భంలో ఏదో వొకటి అంటూనే ఉన్నారు. మోదీకి మీకు మధ్యన ఇబ్బందులుంటే చక్కబెట్టుకోండి. సరిదిద్దుకోండి. కానీ పక్క రాష్ట్రం నాయకుల గురించి… వారిని పొగిడితే మిగిలిన వారిని ఎందుకు పొగడటం లేదు అని ప్రశ్నలు వద్దు బాబు గారు.అయినా దేశంలోనే హైటెక్ సీఎం గా పేరు తెచ్చుకున్నారు.

మోదీ నిర్ణయాలన్నీ గుడ్ అని చెప్పారు. అప్పట్లో కేసీఆర్ పెద్ద నోట్ల రద్దు విషయంలో చాలా జాగ్రత్తగా చెప్పారు. ఇది రెండంచుల కత్తి అన్నారు. తమరు మాత్రం నోట్లు రద్దు చేయాలని చెప్పిందే తామేనని సెలవిచ్చుకున్నారు. అర్ధిక సంఘం నిధులు రానప్పుడు మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అయినా మోదీ కేసీఆర్‌ను మెచ్చుకున్నారు. మీకు మోదీకి మధ్య చెడింది కాబట్టి ఆయనపై విమర్శలు చేసుకోండి మీ ఇష్టం. ఈయనను పొగిడితే.. పాలన గురించి మాట్లాడితే…కూడా తమరు సహించక పోవడం తమలాంటి వారికి తగదు మరి.