కోహ్లీ సెంచరీ వృధా...!

SMTV Desk 2018-10-28 14:08:21  odi, team india, west indies, virat kohli, record, shay hope

పూణే, అక్టోబర్ 28; భారత్ - విండీస్ తో జరుగుతున్న 5 వన్డేల క్రమంలో రెండు వన్డేలు పూర్తి కాగా పూణేలో మూడో వన్డే శనివారం జరిగింది. భారత్‌ టాస్ గెలిచి ఫీల్డింగ్ ని ఎంచుకుని విండీస్ కి బ్యాటింగ్ ఇచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు50 వోవర్లలో 9వికెట్ల నష్టానికి 283 పరుగులు చేసింది.

గత రెండు వన్డేల్లో ఇరు జట్ల వారు 30౦ పైగే పరుగులు చేయగా ఇప్పుడు విండీస్ 283 దగ్గరే ఆగిపోయే సరికి అందరూ మల్లీ భారత్ కే విజయమనుకున్నారు. కాని దానికి పూర్తి భిన్నంగా భారత్ 240 పరుగులకే ఆలౌటయి...40 పరుగుల తేడాతో వోటమి పాలయింది.కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ చేసినా...ఫలితం లేకుండాపోయింది. ఈ మ్యాచ్‌లో గెలుపు ద్వారా మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది విండీస్ జట్టు. విశాఖలో సెంచరీతో మ్యాచ్‌ను టై చేసిన హోప్...పూణెలోనూ సెంచరీ చేసేలా కనిపించాడు. 113బంతుల్లో 6 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 95 పరుగులు చేసిన షై హోప్...5 పరుగుల తేడాతో సెంచరీ మిస్సయ్యాడు. భారత బౌలర్లలో బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టగా, కుల్దీప్ యాదవ్ 2, ఖలీల్ అహ్మద్, చాహల్ చెరో వికెట్ తీసుకున్నారు.

284 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్...మరో 14 బంతులు మిగిలి ఉండగానే 240 పరుగులకు ఆలౌట్ అయింది. విరాట్ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి...వరుసగా మూడో వన్డేలోనూ సెంచరీ సాధించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ వన్డేలో గెలుపుతో 1-1 సిరీస్‌ను సమం చేసింది విండీస్ జట్టు. ఈ నెల 29న ముంబైలోని బ్రాబౌర్న్ స్టేడియంలో నాలుగో వన్డే జరగనుంది.