టీడీపీ మ్యానిఫెస్టో రూపకల్పన పై నేతల చర్చ

SMTV Desk 2018-10-28 13:32:58  ttdp, telangana, telanaga elections, l ramana, tdp manifesto

హైదరాబాద్, అక్టోబర్ 28: టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ నిర్వహించిన సమావేశంలో తెదేపా నేతలు తెలుగుదేశం పార్టీ మ్యానిఫెస్టో రూపకల్పన పై చర్చించారు. అలాగే సీట్ల విషయంలోనూ త్వరలోనే స్పష్టత వస్తుందని టీడీపీ నేతలు వేచి చూస్తున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేస్తున్న టీడీపీ నేతలు ఆ కార్యకలాపాల్లో భాగంగా అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రణాళికలపై దృష్టి సారించారు. కాంగ్రెస్, సీపీఐ, తెలంగాణ జన సమితితో కలిసి పోటీ చేస్తున్న టీడీపీ...ఎన్ని స్థానాలు దక్కుతాయోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది. సీట్లపై క్లారిటీ రాకపోయినప్పటికీ....మేనిఫెస్టో సిద్ధం చేసే పనిలో తెలుగుదేశం నేతలు బిజీ అయ్యారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో భేటీ అయిన పార్టీ ముఖ్యనేతలు... పార్టీ రూపొందించే మ్యానిఫెస్టోను కామన్ మినిమమ్ ప్రోగ్రాంలో ఉంచుతామని తెలుగుదేశం నేతలు అంటున్నారు. మహాకూటమి అధికారంలోకి వస్తే...అన్ని వర్గాలను ఆదుకునేలా మేనిఫెస్టో రూపొందిస్తున్నట్లు టీడీపీ నేతలు తెలిపారు. క్రిష్టియన్, రెడ్డి సామాజిక వర్గాలతో పాటు ఇతర బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు.

అయితే తెలంగాణా ప్రభుత్వం తొలగించిన 26 బిసి కులాలను బిసిల్లో చేరుస్తామని పార్టీ నేతలు హామీ ఇచ్చారు. కాగా మహాకూటమిగా నాలుగు పార్టీలతో కలిసి బహిరంగంగానే ఏర్పడ్డామని టీడీపీ నేతలు వివరించారు. అయితే TRS పార్టీ మాత్రం అంతర్గత