మహేష్ బాబు కూతురుతో రకుల్

SMTV Desk 2017-07-20 18:49:50  Rakul with Mahesh Babu daughter

హైదరాబాద్, జూలై 20 : సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఈ గురువారం రోజున 5 వ పుట్టిన రోజు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా మహేష్ బాబు అభిమానులు ఆమె కు పుట్టిన రోజు శుభాకాంక్షలు కూడా తెలిపారు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఆమెకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా ఆమె తో గతంలో దిగిన ఫోటో ను పోస్టు చేశారు.' సితార ఎప్పుడు చిరునవ్వులు చిందిస్తూ ఉండాలని కోరుకుంటున్నట్లు చెపుతూ పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. సితార కు మరో హీరోయిన్ కాజల్ కూడా బర్త్ డే విషెస్ చెబుతూ ఆమె యువరాణి అని అభివర్ణించారు.