తెలంగాణను మరో సారి వంచించడానికి కుట్ర పన్నారు. - కేటీఅర్

SMTV Desk 2018-10-28 11:57:38  ktr, trs, nara chandrababu naidu, telangana elections

హైదరాబాద్, అక్టోబర్ 28: తెలంగాణ అధికార పార్టీ మంత్రి కేటీఅర్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణను మరో సారి వంచించడానికి కుట్ర పన్నారని, ఇదే క్రమమంలో భాగంగానే ఎన్నికల్లో కోట్లాది రూపాయల పంపిణీకి తెరతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం తెలంగాణ భవన్‌లో విలేకరులతోనూ, లింగాయత్‌లు పార్టీలో చేరిక సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఏపీ ఇంటెలిజెన్స్‌ పోలీసులతో బాబు తెలంగాణలో విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేయిస్తున్నారని ఆరోపించారు.

తమ పార్టీ నేతలు ధర్మపురిలో ముగ్గురిని పట్టుకున్నారని ఆధారలతో సహా నిరూపిస్తామన్నారు. ఈ విషయమై ఎన్నికల సంఘం వెంటనే రంగంలోకి దిగి చంద్రబాబు అధికార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయాలని డిమాండ్‌ చేశారు. తెదేపా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నందుకు.. రూ.500 కోట్లు ఇచ్చి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో