రెండు నెలల బాలుడి కిడ్నాప్‌

SMTV Desk 2018-10-26 12:28:43  CHILD KIDNAP, TELANGANA, STATE POLICE

హైదరాబాద్, అక్టోబర్ 26: రెండు నెలల పసికందును మాయం చేసిన కిడ్నాపర్లు. నిందితుల్లో నలుగురు మహిళలే వుండడం ఆశ్చర్యం. పోలిసుల వివరాల ప్రకారం నగరం లోని చంద్రయాన గుట్టలో, బండ్లగూడ నూరీనగర్‌ ఈ ఘటన చోటుచేసుకుంది.

మహ్మద్‌ ఆసిఫ్‌ ఖురేషీ, మోసినా బేగం దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమారుడు హాజీ(2 నెలలు). మోసీనా బేగం ఇద్దరు కుమార్తెలను తీసుకొని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి వెళ్లింది. ఆస్పత్రి నుంచి అరగంట తర్వా త ఇంటికి వచ్చి చూస్తే చిన్న కొడుకు హాజీ కనిపించలేదు. దీంతో పెద్ద కుమారుడు సొహైబ్‌ను అడగ్గా.. ఓ మహిళ వచ్చి బాబును ఆస్పత్రి వద్దకు తీసుకురమ్మని మీ అమ్మ చెప్పిందని హాజీని తీసుకెళ్లిందని తల్లికి చెప్పాడు. వెంటనే తల్లి మోసినా బేగం.. చుట్టు పక్కల వెతికినా ఫలితం లేకపోవడంతో బాలుడి తల్లిదండ్రులు చాంద్రాయణగుట్ట పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. అందులో అనుమానాస్పదంగా ఓ మహిళ కనిపించింది. వెంటనే మోసినా బేగం దంపతులను పిలిచి ఫుటేజీని చూపించారు. పిల్లోడిని అమ్మాలంటూ తనను ఆ మహిళ సంప్రదించినట్టు మోసినా బేగం చెప్పింది. అప్రమత్తమైన పోలీసులు రెండు బృందాలను రంగంలోకి దించారు.

చంద్రాయణగుట్టకు చెందిన ఫౌజియా బేగమ్‌కు వివాహ మై 12 సంవత్సరాలైనా పిల్లలు కలుగలేదు. దీంతో ఆమె తనకు పిల్లలు కావాలని వాజిదా బేగమ్‌ను అడిగింది. డబ్బు ఎంతై నా ఇస్తానని చెప్పింది. వాజిదా బేగం కొద్ది రోజుల క్రితం మోసిన బేగమ్‌ను కలిసి హాజీని ఇస్తే రూ.30 వేల రూపాయలు ఇప్పిస్తానని ఆశచూపింది. కానీ మోసినా బేగం వొప్పుకోలేదు. దీంతో బాబును కిడ్నాప్‌ చేసేందుకు అబేదాబేగం, షహానాబేగం, అబ్దుల్లా సాయం కోరింది. నలుగు రూ కలిసి పథకం వేశారు. అవకాశం కోసం ఎదురు చూశారు. మోసినా బేగం తన కుమారుడు హాజీని ఇంట్లో వదిలి ఆస్పత్రికి వెళ్లినట్టు వాజిదాబేగం తెలుసుకుంది. హాజీని తీసుకురావాలని అబేదా బేగమ్‌ను పంపింది. బాబును అబేదా ఎత్తుకొచ్చిన తర్వాత నలుగురూ కలిసి గౌస్‌నగర్‌కు వెళ్లి అక్కడ ఫౌజియాబేగమ్‌ను కలిశారు. బాబును అప్పగించి 20 వేల రూపాయలు తీసుకున్నారు. మిగతా డబ్బు తర్వాత ఇస్తానని చెప్పి ఫౌజియా బాబును తీసుకొని వరంగల్‌కు వెళ్లిపోయింది.

వాజిదాబేగమ్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా మొత్తం విషయం బయటపడింది. ప్రత్యేక బృందం వరంగల్‌కు వెళ్లి గురువారం సాయంత్రం బాబును స్వాధీనం చేసుకున్నారు. రాత్రి 8.30కు నగరానికి తీసుకొచ్చి కిడ్నాప్‌ అయిన బాబును తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఘటనలో ఐదుగురిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.