ఎమ్మెల్సీ ఎన్నికల వోటర్ నమోదుకు గడువు...

SMTV Desk 2018-10-25 17:50:03  MLC ELECTIONS, VOTER ,CHANDRA SHEKAR GOUD

కామారెడ్డి, అక్టోబర్ 25: పట్టభద్రులు, ప్రతీ శాఖ ఉద్యోగులు రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల కోసం వోటు నమోదు చేసుకోవాలని రాష్ట్ర గ్రూప్-1 ఆఫీసర్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్ సూచించారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్ భవనంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. సాధారణ ఎన్నికల్లో వోటరు నమోదునకు కల్పించినంత ప్రచారం ఎన్నికల కమిషన్ ఎమ్మెల్సీ వోటు నమోదు కోసం చర్యలు చేపట్టడంలేదని అన్నారు. ఎన్నికల కమిటీ విస్తృత ప్రచారం చేయాలని అన్నారు.
వివరాలు ;
1. 2018 నవంబర్ 1వ తేదీకి మూడు సంవత్సరాల ముందు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
2. 2015 నవంబర్ 1 నాటికి డిగ్రీ, తత్సమాన కోర్సుల్లో డిగ్రీ పొంది ఉండాలి.
3. కనీసం మూడేళ్లు నియోజక వర్గ పరిధిలో నివాసం ఉండాలి.
4. గ్రాడ్యుయేట్ వోటరుగా నమోదు అయ్యే వారు ఫారం-18ని పూర్తి చేసి స్థానిక తహశీల్దారు/ఎంపీడీఓ కార్యాలయాల్లో అందచేయాలి.
5. గతంలో వోటరుగా నమోదు అయిన వారు మరలా గ్రాడ్యుయేట్ వోటరుగా నమోదు కావాలి
6. ఫారం-18తోపాటు డిగ్రీ సర్టిఫికెట్ జత చేయాల్సి ఉంటుంది.
7. ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు అయిన వారు సంబంధిత డిపార్ట్ మెంట్ అధికారి ధృవీకరణతో పంపించాలి.
8. సాధారణ వోటర్ల జాబితాకు, పట్టభద్రుల వోటర్ల జాబితాకు ఎలాంటి సంబంధం లేదు.